Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelanganaWELFAREWomenYouth

ప్రజావాణి వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్, డీఆర్ఓ

ప్రజావాణి వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్, డీఆర్ఓ

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపుకలెక్టర్ డి.వేణుగోపాల్, డీఆర్ఓ పద్మావతి, జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీరామ్, హౌసింగ్ పీడీ సవేరామ్ ప్రజల వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల దరఖాస్తులు పరిశీలించి, త్వరగా ఆయా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. పలుప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు భూముల సమస్యలు, రెవెన్యూ అంశాలు, సంక్షేమ పథకాలు, ఉపాధి, పింఛన్లు, ఇందిరమ్మ గృహాలు, మౌలిక వసతులు, సామాజిక భద్రత, తదితర సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అదనపుకలెక్టర్ వేణుగోపాల్ ప్రజలిఛ్చిన ప్రతి దరఖాస్తు అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, గడువులోగా పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. తక్షణమే పరిష్కరించగల సమస్యలను ఎలాంటి ఆలస్యం లేకుండా పరిష్కరించాలని, క్లిష్టమైన సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ బాధితులకు న్యాయంజరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కేంద్రంతోపాటు ప్రతి మండలంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లుగా అదనపుకలెక్టర్ తెలిపారు. ప్రజలందరూ తమకు సమీపంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయాల్లో వినతులు సమర్పించి, ఆ స్థాయిలోనే సమస్యలకు పరిష్కారం పొందాలని సూచించారు. వినతులతో పాటు సంబంధిత ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
—————–
ప్రజావాణిలో వచ్చిన కొన్ని వినతులు
—————–
అశ్వాపురం మండలంలోని నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి నిధులు దుర్వినియోగం చేసినందుకు అతనిని తొలగించి చట్టపరంగా క్రిమినల్ కేసులుపెట్టాలని ఓ దరఖాస్తులో కోరారు.

గుండాల మండలం కొడవటంచ గ్రామం లోని పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత నివారించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని ఓ దరఖాస్తు చేశారు.

మణుగూరు మండలం అజయ్ నగర్ గ్రామానికి చెందిన చిట్టిమల్ల శిరీష, తాను అంగన్వాడీ టీచర్ ఉద్యోగానికి చేసిన దరఖాస్తులో రెసిడెన్షియల్ సర్టిఫికెట్ సమర్పించనందున విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

మణుగూరు మండలం రామానుజవరం గ్రామపంచాయతీ మల్లేపల్లి గ్రామానికి చెందిన తడికల ఆకాంక్ష, అంగన్వాడీ టీచర్ ఉద్యోగానికి తనకు మెరిట్ ఉన్నా ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయలేదని తగిన న్యాయం చేయాలని దరఖాస్తు చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పేద రోగికి నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

Divitimedia

గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి

Divitimedia

భూ రీసర్వే వేగవంతంగా పూర్తిచేయాలి

Divitimedia

Leave a Comment