టి.జి.ఎఫ్.డి.సి ఆధ్వర్యంలో ఘనంగా ఏక్తాదివస్ వేడుకలు


✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టి.జి. ఎఫ్.డి.సి)ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లిలో సంస్థ కొత్తగూడెం డివిజన్ కార్యాలయం ప్రాంగణంలో శనివారం “రాష్ట్రీయ ఏక్తా దివస్(జాతీయ ఐక్యతా దినోత్సవం)” వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ మాజీ ఉపప్రధాని, హోం మంత్రి ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 151 వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి టి.జి.ఎఫ్.డి.సి జనరల్ మేనేజర్ డాక్టర్ స్కైలాబ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జీఎం డాక్టర్ స్కైలాబ్ మాట్లాడుతూ, దేశ సమగ్రత, ఐక్యత కోసం సర్దార్ పటేల్ చేసిన సేవలను కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడతామని, పటేల్ ఆశయ సాధనకు కట్టుబడి పనిచేస్తామని అధికారులు, ఆ సంస్థ సిబ్బంది జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కొత్తగూడెం, పాల్వంచ డివిజనల్ మేనేజర్లు విజయభారతి, మాధవి, ప్లాంటేషన్ మేనేజర్లు గోగు సురేష్ కుమార్, సైదానాయక్, వెంకటేశ్వర్ రావు, ఫారెస్ట్ కళాశాల విద్యార్థులు (ట్రైనీస్), సిబ్బంది పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

