Divitimedia
BusinessKhammamLife StyleSpot NewsTechnologyTelanganaWELFAREWomen

మధిర సబ్‌డివిజన్‌లో నిరంతర విద్యుత్ సరఫరా

మధిర సబ్‌డివిజన్‌లో నిరంతర విద్యుత్ సరఫరా

తుఫానుతో అంతరాయమేర్పడితే తక్షణ చర్యలు

టీజీఎన్పీడీసీఎల్ మధిర ఏడీఈ అనూరాధ

✍️ దివిటీ మీడియా – మధిర

మురసు తుఫాను నేపథ్యంలో మధిర, ఎర్రుపాలెం మండలాల పరిధిలో నిరంతర విద్యుత్ సరఫరాకు అన్ని చర్యలు చేపట్టినట్లు టీజీఎన్పీడీసీఎల్ మధిర సబ్‌డివిజన్ ఏడీఈ అనురాధ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో మాటూరు సబ్‌ స్టేషన్ పరిధిలో విద్యుత్ స్తంబాలపై చెట్లు పడటంతో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. తమ సిబ్బంది వెంటనే స్పందించి ఆ చెట్లు తొలగించి రాత్రి 11 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు ఆమె వివరించారు. తుఫాను ప్రభావంతో ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయమేర్పడితే తక్షణమే పరిష్కరించేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే సంబంధిత సెక్షన్ ఏఈకి గానీ సిబ్బందికి గానీ సమాచారం అందించాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దమ్మపేట ఆర్ఐ జబ్బా ఎర్రయ్యపై సస్పెన్షన్ వేటు

Divitimedia

మోరంపల్లిబంజరలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిక

Divitimedia

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి సీఆర్పీఎఫ్ అభినందనలు

Divitimedia

Leave a Comment