Divitimedia
Bhadradri KothagudemCrime NewsHealthJudicialKhammamLife StyleSpot NewsTechnologyTelanganaWELFARE

గంజాయి, హషీష్ ఆయిల్‌ నిర్వీర్యం చేసిన డ్రగ్ డిస్పోజల్ కమిటీ

గంజాయి, హషీష్ ఆయిల్‌ నిర్వీర్యం చేసిన డ్రగ్ డిస్పోజల్ కమిటీ

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం 35 కేసులలో పట్టు బడిన 982.562కేజీల గంజాయి, హషీష్ ఆయిల్‌ను నిర్వీర్యం చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో గోపాలపేట గ్రామంలోని ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్ సంస్థలో ఆ మత్తుపదార్థాలను పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ, డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ నిర్వీర్యం చేసిన మాదకద్రవ్యాల్లో 977 కిలోల 816 గ్రాముల గంజాయితోపాటు, 4 కిలోల 746 గ్రాముల హషీష్ ఆయిల్ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ డ్రగ్స్ మొత్తం విలువ దాదాపు రూ.4 కోట్ల 91 లక్షలు ఉంటుందని వెల్లడించారు. ఈ నిర్వీర్య ప్రక్రియలో పర్యావరణం, ప్రజారోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా వారి కుటుంబాల ఆశలను కూడా దెబ్బతీస్తుందన్నారు. మాదకద్రవ్యాల అక్రమరవాణా, విక్రయ, వినియోగాన్ని ప్రోత్సహించే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతూ గంజాయి అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపుతూ ఉన్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, క్రయవిక్రయాల గురించి సమాచారం తెలిసినవారు వెంటనే ఆ విషయం పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సభ్యులు, సీఐ కరుణాకర్, ఆర్ఐ నరసింహారావు, ఎస్సై హారిక, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వరుసగా బయటపడుతున్న ఐకేపీ అక్రమాలు…

Divitimedia

ఏపీలో 51 కరువు ప్రభావిత మండలాలు ప్రకటన

Divitimedia

అంతరపంటల సాగుతో ఆర్థికాభివృద్ధి

Divitimedia

Leave a Comment