Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTelanganaYouth

మద్యం తాగించి బైక్ ఎత్తుకెళ్లాడు…

మద్యం తాగించి బైక్ ఎత్తుకెళ్లాడు…

బైక్ దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు

నిందితుడి అరెస్ట్, మోటార్‌సైకిల్ స్వాధీనం

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

చెడు వ్యసనాలకు అలవాటుపడి, వాటి కోసం సులభంగా డబ్బుసంపాదించాలనే ఉద్దేశంతో మోటార్‌సైకిల్ దొంగతనానికి పాల్పడిన ఒక నిందితుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు, లక్ష్మీదేవిపల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. దొంగిలించిన హోండా యూనికార్న్ మోటార్‌సైకిల్‌ అతని వద్ద నుంచి స్వాధీనంచేసుకున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు వెల్లడించిన ఆ వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 174/2026 కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు చేపట్టిన చర్యల్లో జయశంకర్ కాలనీకి చెందిన తాటి బుజ్జిబాబు అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో గతంలో అతనిపై కాపర్, బైక్ దొంగతనాలకేసులు, హత్యకేసు నమోదైనవిషయం చెప్పాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో, వచ్చిన ఆదాయం కుటుంబ పోషణకు, తన వ్యసనాలకు సరిపోవడం లేదనే కారణంతో సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనానికి పథకం వేశాడు. ఈ క్రమంలో ఆగస్టు 3వ తేదీన మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్య లక్ష్మీదేవిపల్లిలోని బావర్చి సెంటర్ సమీపంలో ఉన్న బిల్లా పాన్ షాప్ వద్ద నంబర్ ప్లేట్ లేని హోండా యూనికార్న్ మోటార్‌సైకిల్‌ను గుర్తించాడు. బైక్ యజమానితో పరిచయం పెంచుకుని, అతనికి మద్యం తాగించి, మద్యం మత్తులో ఉన్న సమయంలో బైక్ తాళం తీసుకుని మోటార్‌సైకిల్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మోటార్‌సైకిల్‌ను విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నెల 10న బయటకు తీసుకువెళ్తుండగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించడం గమనించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడ్ని పట్టుకుని విచారించగా, మోటార్‌సైకిల్ దొంగతనం చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు తాటి బుజ్జిబాబును అరెస్ట్ చేసి, దొంగిలించిన హోండా యూనికార్న్ మోటార్‌సైకిల్‌ను లక్ష్మీదేవిపల్లి పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. వాహనాలు, ఇతర ఆస్తుల చోరీల విషయంలో అనుమానాస్పద ఘటనలు గమనించినా, తమ ఆస్తులు చోరీకి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కోరారు. ఈ కేసును ఛేదించడంలో సమన్వయంతో పనిచేసిన టాస్క్ ఫోర్స్, లక్ష్మీదేవిపల్లి పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విజయ రథసారథులు విచ్చేస్తున్న వేళ…

Divitimedia

ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

Divitimedia

ఆస్తిపన్నుల వసూలుకు డప్పు కొట్టండన్న కలెక్టర్

Divitimedia

Leave a Comment