Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTechnologyTelanganaWELFAREWomenYouth

జిల్లాలో నిఘావ్యవస్థ మరింత బలోపేతం

జిల్లాలో నిఘావ్యవస్థ మరింత బలోపేతం

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసు నిఘా వ్యవస్థ మరింత పటిష్టం ఛేసేలా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌ సందర్శించి, నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ ను ప్రారంభించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, నేరాల గుర్తింపు, దర్యాప్తు మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. దీనిలో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, పోలీస్ స్టేషన్లలో కెమెరాలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అను సంధానం చేశారు. ప్రస్తుతం మొత్తం 467 సీసీటీవీ కెమెరాలను ఈ కేంద్రానికి అను సంధానం చేయడం వల్ల జిల్లాలో నిఘా వ్యవస్థ మరింత బలోపేతమైంది. దీని ద్వారా ఆయాప్రాంతాల్లోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, నేరాల నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడం సులభతరం కానుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసి వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, నేర నియంత్రణ విషయంలో సీసీటీవీ నిఘావ్యవస్థ కీలక పాత్ర పోషించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ మొక్కలు నాటారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణతోపాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మూడేళ్లలో అర్హులందరికీ ఇళ్లు, ఆర్థిక భరోసా లక్ష్యం

Divitimedia

కలెక్టరేట్ లో మళ్లీ మళ్లీ అదే నిర్లక్ష్యమా…?

Divitimedia

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి…

Divitimedia

Leave a Comment