Divitimedia
Bhadradri KothagudemHealthHyderabadKhammamLife StyleSpot NewsTechnologyTelanganaWELFAREWomenYouth

ఆర్నబ్ తుఫాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

ఆర్నబ్ తుఫాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు

✍️ దివిటీ మీడియా – ఖమ్మం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్‌ ఆర్నబ్ ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఈ తుఫాన్‌ ప్రభావంతో ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలకెలాంటి ఇబ్బందులు, నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈమేరకు మంత్రి పొంగులేటి బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ దివాకర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ లతో ఫోన్లో మాట్లాడారు. మంత్రి వాతావరణ పరిస్థితులపై ఆరాతీశారు. రెండుజిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తుఫాన్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, సంబంధిత అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసు కోవాలని స్పష్టం చేశారు. అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ఎప్పటి పరిస్థితులకనుగుణంగా అప్పుడే తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి కలెక్టర్లకు సూచించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీఎంను కలిసిన ముస్లిం ప్రజాప్రతినిధులు

Divitimedia

రాజకీయాలకతీతంగా ప్రజాసేవ : ఎంపీ రఘురాంరెడ్డి

Divitimedia

జిల్లా ఆసుపత్రిలో బయోమెట్రిక్ హాజరు తీరుపై కలెక్టర్ ఆగ్రహం

Divitimedia

Leave a Comment