Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTelanganaWELFAREYouth

తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు

తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు

ఒకరోజు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ అంకిత్

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

అర్నబ్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం 28వ తేదీన ఒక రోజు సెలవు ప్రకటించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ ద్వారా జారీ చేయబడిన వాతావరణ హెచ్చరికలు, బులెటిన్లప్రకారం, తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీవర్షాలు, ప్రతి కూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల సాధారణ జనజీవనానికి అంతరాయం కలగడమే కాకుండా, విద్యార్థులు, విద్యా సిబ్బంది భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదమున్నందున, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాసంస్థలలో విద్యార్థులు, సిబ్బంది భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని భావించి, సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మానవత్వంతో స్పందించిన ‘ఉన్నత’ హృదయం…

Divitimedia

అసెంబ్లీ ఎన్నికల్లోపు ఓటర్లకు చివరి అవకాశం

Divitimedia

విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభలు జయప్రదం చేయండి

Divitimedia

Leave a Comment