Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTelanganaWELFARE

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో సైకిల్ ర్యాలీ

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో సైకిల్ ర్యాలీ

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు, టీజీఎస్పీ పోలీసులు ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లాఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ర్యాలీ కొత్తగూడెం రైల్వేస్టేషన్ సమీపం నుంచి పాత డిపో, పోస్ట్ ఆఫీస్ సర్కిల్ మీదుగా కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, విధి నిర్వహణలో తమ ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారిసేవలను ప్రజలకు తెలియజేయడం, పోలీసుల సేవలు, త్యాగాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. దేశం, సమాజం, ప్రజల రక్షణ కోసం అమరవీరులు చేసిన త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజాభద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, పోలీసు అమరవీరుల త్యాగాలను అందరూ గుర్తుంచుకోవాలని కోరారు. పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, టీజీఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్లు రామకృష్ణారెడ్డి, రంజిత్ కుమార్, సీఐలు వెంకటేశ్వర్లు, ఇంద్రసేనా రెడ్డి, జితేందర్, ఆర్‌ఐలు సుధాకర్, కృష్ణారావు, జి.వి.రామారావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విధులలో మరణించిన హోంగార్డ్స్ ఆఫీసర్స్ కుటుంబాలకు అండగా ఉంటాం

Divitimedia

ఏజెన్సీ పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

ఆహారం తీసుకునే ప్రతిసారి చేతులు శుభ్రపరచుకోవాలి

Divitimedia

Leave a Comment