Divitimedia
Bhadradri KothagudemHealthHyderabadLife StyleNational NewsSportsSpot NewsTelanganaYouth

రాష్ట్రస్థాయి పోటీల్లో భద్రాద్రి యువకుడికి బంగారుపతకం

రాష్ట్రస్థాయి పోటీల్లో భద్రాద్రి యువకుడికి బంగారుపతకం

జర్నలిస్ట్ వస్కా ప్రసాద్ కుమారుడు సుజ్ఞాన్‌ ప్రతిభ

✍️ దివిటీ మీడియా – భద్రాచలం

రాష్ట్ర స్థాయి రింగ్ ఫైట్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భద్రాచలానికి చెందిన సుజ్ఞాన్ బంగారు పతకం సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు. రింగ్ ఫైట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలులో నిర్వహించిన ఈ పోటీల్లో సుజ్ఞాన్ అద్భుతంగా ప్రతిభ కనబరిచి ప్రథమస్థానం సాధించాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ ప్రదేశాల్లో జరిగిన పోటీల్లో ఈ యువకుడు మూడు పథకాలు సాధించడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వస్కా ప్రసాద్ కుమారుడైన సుజ్ఞాన్ రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారుపతకం సాధించడం పట్ల కుటుంబసభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రీడల్లో పట్టుదల, క్రమశిక్షణతో సాధన చేస్తే విజయాలు సాధించవచ్చని సుజ్ఞాన్ నిరూపించాడని పలువురు అతడిని అభినందిస్తున్నారు. సుజ్ఞాన్ భవిష్యత్తు లో మరిన్ని విజయాలు సాధించాలని, భద్రాచలం ప్రాంతానికి మంచిపేరు తీసుకు రావాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అటవీ–రెవెన్యూ భూసమస్యల పరిష్కారం వేగవంతం చేయాలి

Divitimedia

‘ప్రజావాణి’లో దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి ఆదేశించిన కలెక్టర్

Divitimedia

ఆఫీస్ సబార్డినేట్ సేవలను అభినందించిన కలెక్టర్

Divitimedia

Leave a Comment