Divitimedia
Andhra PradeshLife StyleSpot NewsTravel And TourismWomen

వేణుగోపాలస్వామి హుండీ ఆదాయం రూ.24.19లక్షలు

వేణుగోపాలస్వామి హుండీ ఆదాయం రూ.24.19లక్షలు

✍️ దివిటీ మీడియా – మధిర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం, నెమలి గ్రామం లో వేంచేసియున్న శ్రీవేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో హుండీ ఆదాయం రూ.23.66 లక్షలు లభించింది. భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించగా దేవాలయంలోని 7హుండీల్లో ఆదాయం రూ.23,66,053, అన్నదానం హుండీలో రూ.53,301తో కలిపి మొత్తం రూ.24,19,354 ఆదాయం వచ్చింది. ఈ ఆదాయంతో పాటు బంగారం -700మిల్లీ గ్రాములు, వెండి-500 గ్రాములు, 100 మిల్లీ గ్రాములు వచ్చాయి. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా దేవాదాయశాఖాధికారి ఎన్.సాంబశివ రావు, సహాయ కమీషనర్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్.సంధ్య, అంబరుపేట శ్రీసత్యమ్మ అమ్మవారి దేవ స్థానం కార్యనిర్వహణాధికారి పీవీకే సీతారావమ్మ, నందిగామ శ్రీసీతారామ స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.నరసింహమూర్తి, రెవిన్యూ, పోలీస్ సిబ్బంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది, సత్యసాయి సేవాసమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అక్రమార్కులకే అందలం… అభివృద్ధికి మంగళం…

Divitimedia

ఆత్మహత్యకు యత్నించిన వృద్ధురాలిని కాపాడిన బ్లూకోల్ట్స్ పోలీసులు

Divitimedia

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జాతీయ అవార్డు

Divitimedia

Leave a Comment