ఈ వృద్ధురాలు ఎవరో ఆచూకీ తెలిస్తే చెప్పండి
✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పరిధిలోని మోరంపల్లిబంజర పరిసరాల్లో దాదాపు 70 ఏళ్ల వయసున్న వృద్ధురాలు పొరపాటున తప్పిపోయిన రీతిలో సంచరిస్తున్నారు. స్థానికులు ఆమె వివరాలు అడిగితే మాత్రం తన ఊరు బెల్లంపల్లి అని, పేరు రాపిల్లి దాస్ కమలమ్మ అని చెబుతున్నారే తప్ప పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నారు. స్థానికులు బూర్గంపాడు పోలీసులకు ఆ వృద్ధురాలి గురించి సమాచారం ఇవ్వగా, ఎస్సై మేడా ప్రసాద్ ఆమెను పోలీస్ స్టేషనుకు తీసుకువచ్చారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులు గానీ బంధువులు గానీ పూర్తి వివరాలు తెలిసినవారెవరైనా బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై మేడా ప్రసాద్ ఓ ప్రకటనలో కోరారు. ఆమె గురించి తమ సెల్ ఫోన్ నెంబర్లు: 8712682055, 8712682056 లో సంప్రదించాలని ఎస్సై ప్రసాద్ కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

