జూలూరుపాడులో ఆర్ఎంపీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాలతో గురువారం జూలూరుపాడు మండలంలో ‘క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్’ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాందాస్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాయిచరణ్ ప్రథమ చికిత్స కేంద్రంలో స్టెరాయిడ్లు, యాంటీ బయోటిక్స్, సెలైన్ బాటిల్స్ ను గుర్తించి నోటీసులు అందజేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాకేశ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్.నాగలక్ష్మి, శివ పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

