Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTelanganaWomenYouth

పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ

పోలీస్ స్టేషన్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ

ఇరువర్గాలను అరెస్ట్ చేసిన పోలీసులు

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

గణేష్ నిమజ్జనాల బందోబస్తు విధుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిమగ్నమై ఉన్న సమయంలో, శుక్రవారం కొత్తగూడెం 3టౌన్ పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒక కుటుంబ వివాదానికి సంబంధించి పోలీస్ స్టేషన్‌కు వచ్చినవారు పరస్పరం దూషించుకోవడంతో పాటు దాడులకు పాల్పడటమే కాకుండా, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని నెట్టివేసి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఈ ఘటనపై పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి… కొరదల కుమార్, అతని భార్య వినోదకు సంబంధించిన కుటుంబ వివాదం నేపథ్యంలో ఇరువర్గాల వారు కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి పరస్పరం దూషించుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దున్నపోతుల రాజు అనే వ్యక్తిపై ఇటుకరాయితో దాడి చేయడంతో అతని ముక్కుపై రక్తగాయం అయినట్లు ఫిర్యాదు అందింది. వెంకట మల్లు అనే మహిళను కొందరు వ్యక్తులు జుట్టు పట్టుకుని, చేతులతో కొట్టినట్లు మరో ఫిర్యాదు అందింది. ఇరువర్గాల మధ్య పరస్పరం బెదిరింపులు, దూషణలు జరిగినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఘర్షణను అదుపు చేసే క్రమంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులను సైతం ఇరువర్గాల వారు నెట్టివేసి, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వారి విధులకు ఆటంకం కలిగించారని డీఎస్పీ పేర్కొన్నారు. సంచలనం రేగిన ఈ ఘటనపై అందిన ఫిర్యాదులమేరకు కేసులు నమోదు చేసి, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

యూపెస్సీ ర్యాంకర్ల ఆధ్వర్యంలో ‘స్పూర్తి’ కార్యక్రమం

Divitimedia

Divitimedia

నలుగురు మావోయిస్టు పార్టీ కొరియర్ల అరెస్ట్

Divitimedia

Leave a Comment