Divitimedia
Bhadradri KothagudemFarmingLife StylePoliticsSpot NewsTechnologyTelangana

గాదె నర్సిరెడ్డికి ఆదర్శరైతు అవార్డు

గాదె నర్సిరెడ్డికి ఆదర్శరైతు అవార్డు

✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు

వ్యవసాయ రంగంలో విశేష ప్రతిభతో తనదైన శైలితో ముందుకు సాగుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర గ్రామానికి చెందిన గాదె నర్సిరెడ్డికి ‘ఆదర్శరైతు’ గా అవార్డు దక్కింది. వ్యవసాయ రంగంలో ఆయన సేవలను గుర్తిస్తూ 2025 కిసాన్ దివస్ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం కృషి విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో ఆదర్శ రైతు అవార్డుకు ఆయనను ఎంపిక చేసి సత్కరించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా గాదె నర్సిరెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు. వ్యవసాయం కేవలం వృత్తి మాత్రమేకాదని, ఎన్నోకుటుంబాల కోసం జీవనాధారమని నర్సిరెడ్డి చెప్తారు. రైతు కష్టపడితేనే సమాజానికి ఆహారం అందుతుందని, అలాంటి వ్యవసాయ రంగంలో సేవలకు గుర్తింపు పొందడం తనకెంతో గర్వకారణంగా నిలిచిందని ఈ సందర్భంగా నర్సిరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు లభించిన ఈ గుర్తింపు మోరంపల్లిబంజర బంజరకే కాకుండా బూర్గంపాడు మండలానికి కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని,
రైతుల కృషిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం కలుగుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గాదె నర్సిరెడ్డికి లభించిన ఆదర్శరైతు అవార్డు ఇతర రైతులకు కూడా స్ఫూర్తినిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

హైదరాబాదులో 20న ‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అవేర్ నెస్ డ్రైవ్’

Divitimedia

పామాయిల్ గెలల అక్రమతరలింపు కేసులో 9మంది అరెస్ట్

Divitimedia

జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

Divitimedia

Leave a Comment