Divitimedia
EducationInternational NewsLife StyleSpot NewsTechnologyTelanganaTravel And TourismWELFAREYouth

టామ్ కామ్ ఆధ్వర్యంలో జర్మన్ భాషా శిక్షణపై ఓరియంటేషన్

టామ్ కామ్ ఆధ్వర్యంలో జర్మన్ భాషా శిక్షణపై ఓరియంటేషన్

వినియోగించుకోవాలన్న జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి

✍️ దివిటీ మీడియా – ఖమ్మం

ఖమ్మంజిల్లాలోని నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌ పవర్ కంపెనీ (టామ్ కామ్) ద్వారా ఈ నెల 23న జర్మన్ భాషపై శిక్షణకు ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎన్.మాధవి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జర్మనీ దేశంలో ఉపాధి అవకాశాలకు అవసరమైన భాష పరిజ్ఞానంపై శిక్షణపొందేందుకు ఆసక్తిగల యువతీయువకులు ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరై, శిక్షణ వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకోవాలని ఆమె కోరారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 23న (శుక్రవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఖమ్మంలో వైరా రోడ్డులో కవిరాజ్ నగర్ జలాంజనేయస్వామిస్వామి దేవాలయం పక్కనున్న  టీటీడీసీలో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకోసం ఫోన్ నెం.6305157085 లో సంప్రదించాలని పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీఎంను కలిసిన ముస్లిం ప్రజాప్రతినిధులు

Divitimedia

మహిళల రక్షణే షీటీమ్స్ ప్రధాన లక్ష్యం : ఎస్పీ డా.వినీత్

Divitimedia

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు నేడు ఎంపికలు

Divitimedia

Leave a Comment