పోలీసులు యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే చర్యలు తప్పవు
హెచ్చరించిన తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
✍️ దివిటీ మీడియా – హైదరాబాద్
పోలీసులు యూనిఫామ్‌లో ఉన్నప్పుడు డ్యాన్స్ చేయడం, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. యూనిఫామ్ లో అలాంటివి చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఇటీవల పోలీసులు యూనిఫామ్‌లో ఉండి డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అవ్వడంతో పోలీసు శాఖ క్రమశిక్షణపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో డీజీపీ ఓ ప్రకటనలో దీనిపై స్పష్టత ఇచ్చారు. పోలీసు యూనిఫామ్ బాధ్యత, అధికారం, క్రమశిక్షణకు ప్రతీక అని, దాని గౌరవం కాపాడాలని డీజీపీ సూచించారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించే సిబ్బందిపై కఠినమైన క్రమశిక్షణచర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు…
Save or share this story as a newspaper-style Epaper Clip:

