Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpot NewsTechnologyTelanganaWELFARE

జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

వార్షికతనిఖీల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌ను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆ పోలీస్ స్టేషన్‌లో నమోదైన యూఐ, గ్రేవ్, ప్రాపర్టీ కేసుల వివరాలు సమీక్షించారు. దీర్ఘకాలిక పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. క్రైమ్ రికార్డులు క్రమబద్ధంగా నిర్వహించాలని, ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. క్రైమ్ ప్రాపర్టీ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, స్వాధీనం చేసుకున్న ఆస్తుల భద్రత, గుర్తింపు, కోర్టు సంబంధిత ప్రక్రియలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ 2.0లో కేసుల వివరాలు సక్రమంగా నమోదు చేయడంతోపాటు ఈ-సాక్ష్య, నాట్‌గ్రిడ్, గాండీవ, వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి, యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలనడిగి తెలుసుకుని, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సీఐ శ్రీలక్ష్మి, ఎస్సైలు జీనత్ కుమార్, మనీషా, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రూ.90లక్షల విలువైన గంజాయి పట్టుకున్న పోలీసులు

Divitimedia

ఆస్పిరేషన్ జిల్లాలన్నింటికీ భద్రాద్రి ఆదర్శంగా ఉండాలి

Divitimedia

వరదల్లో ప్రాణరక్షణ కోసం అగ్రికల్చర్ డ్రోన్లు

Divitimedia

Leave a Comment