Divitimedia
AMARAVATHIAndhra PradeshLife StyleMARKAPURAMNational NewsPRAKASAMSpot NewsTravel And TourismWELFARE

ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు శుభవార్త

మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సర్వీస్

✍️ దివిటీ మీడియా – అమరావతి

ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందజేసింది. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని విజయవాడ మీదుగా మచిలీపట్నం – కర్నూలు మధ్య వారానికి మూడురోజులు నడిచే కొత్త రైలు సర్వీసుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ కొత్త రైలుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుడివాడ, వినుకొండ, నంద్యాల, ఇతర ప్రధాన స్టేషన్లకు నేరుగా రైలుసౌకర్యం కలుగనుంది. ఆంధ్రప్రదేశ్‌ లోని తీర, మధ్య ప్రాంతాల నడుమ అదనపు రైలుసదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ ఆమోదం పొందిన మచిలీపట్నం – కర్నూలు సిటీ ఎక్స్‌ప్రెస్ 499 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మచిలీపట్నం నుంచి 16:55 గంటలకు(సాయంత్రం) బయలు దేరి, మరుసటి రోజు 05:45 గంటలకు (ఉదయం) కర్నూలు సిటీ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో, కర్నూలు సిటీ – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ కర్నూలు సిటీ నుంచి 09:30 గంటలకు (ఉదయం) బయలుదేరి, అదేరోజు 21:35 గంటలకు (రాత్రి) మచిలీపట్నం చేరుకుంటుంది.
మచిలీపట్నం – కర్నూలు సిటీ ఎక్స్‌ప్రెస్ సోమవారం, బుధవారం, శనివారాల్లో నడుస్తుంది. అదేవిధంగా కర్నూలు సిటీ – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ మంగళవారం, గురువారం, ఆదివారాల్లో నడుస్తుంది. ఈ కొత్త రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్డు, కంబం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్
రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. ఈ కొత్త సర్వీసుతో ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు అదనపు ప్రయాణసౌకర్యం కల్పించడం తోపాటు, మచిలీపట్నం, విజయవాడ, కర్నూలు నగరాల మధ్య అనుసంధానం పెరుగుతుంది. ఈ మార్గంలోని పలు పట్టణాలు, నగరాలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడుతుంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గంజాయి, హషీష్ ఆయిల్‌ నిర్వీర్యం చేసిన డ్రగ్ డిస్పోజల్ కమిటీ

Divitimedia

Divitimedia

అక్కాతమ్ముళ్లకు నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

Divitimedia

Leave a Comment