Divitimedia
Bhadradri KothagudemHyderabadLife StyleSpot NewsTechnologyTelanganaWELFARE

వర్షాల నేపథ్యంలో నిరంతరాయ కంట్రోల్ రూమ్

వర్షాల నేపథ్యంలో నిరంతరాయ కంట్రోల్ రూమ్

వెల్లడించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. వాతావరణ శాఖ మరో ఐదురోజులపాటు వర్ష హెచ్చరికలు జారీచేసినందున ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఐడీఓసీలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఐడీఓసీలోని జి–19 గదిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08744-241950 నెంబరు‌తో 24×7 అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. వివిధ శాఖలకు చెందిన సిబ్బందిని మూడు షిఫ్టుల్లో విధులకు నియమించి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, అత్యవసర సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు చేరవేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్‌ కు వచ్చే ప్రతి ఫోన్ కాల్‌ను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, ఆ సమస్యకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖ అధికారులకు వెంటనే తెలియజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షాలు, వరదల పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
ప్రజలు వర్షాలు, వరదలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నెంబర్‌ 08744-241950 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

JUNIOR ENGINEER (CIVIL, MECHANICAL & ELECTRICAL) EXAMINATION, 2024

Divitimedia

కమీషన్ ఇవ్వలేదని కొత్తగా నిర్మించిన రోడ్డు తవ్వేసిన ఎమ్మెల్యే అనుచరులు

Divitimedia

ఎన్నికలకు ముందు INTUCలో భారీ చేరికలు

Divitimedia

Leave a Comment