Divitimedia
Bhadradri KothagudemHealthJayashankar BhupalpallyLife StyleSpot NewsTechnologyWELFAREYouth

అన్నపురెడ్డిపల్లిలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు

అన్నపురెడ్డిపల్లిలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు

✍️ దివిటీ మీడియా – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.తుకారాంరాథోడ్ శనివారం ఎర్రగుంట పీహెచ్‌సీ పరిధిలోని అన్నపురెడ్డిపల్లి సబ్‌ సెంటర్‌ ఆకస్మికంగా తనిఖీచేశారు. ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు, ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారికి అందుతున్న ఆరోగ్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా, ఖచ్చితమైన వివరాలు నమోదు చేసి నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్యసేవలందించి, అవసరమైన సందర్భాల్లో ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేసి తదుపరి చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకం పెరిగేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆ సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో డీఎంహెచ్‌ఓ అన్నపురెడ్డిపల్లి ప్రాంతంలో రెండు ప్రైవేట్ డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్ రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించి, ఆ నిర్వాహకులకు నోటీసు జారీచేశారు. ఈ సందర్భంగా అవసరమైన వివరాలతో మూడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేట్ డయాగ్నస్టిక్‌ కేంద్రాలు ప్రభుత్వ పెట్టిన నిబంధనలు, అనుమతులు, నమోదు ప్రక్రియలను తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్‌ఓ స్పష్టంచేశారు. ప్రజల ఆరోగ్యంతో ముడి పడిన వైద్య నిర్ధారణ సేవల్లో నిర్లక్ష్యానికి తావులేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. అన్నపురెడ్డిపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కూడా సందర్శించారు. అక్కడి విద్యార్థినులతో మాట్లాడి వారి వారి ఆరోగ్య పరిస్థితులు, వ్యక్తిగతపరిశుభ్రత, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై కూడా అవగాహన కల్పించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న యాంటీ రేబీస్ వారోత్సవం సందర్భంగా కుక్కకాటు నివారణ, చికిత్స, కుక్కల పెంపకంవంటి అంశాలపై విద్యార్థినులకు వివరించారు. సమతుల ఆహారం, వ్యక్తి గత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య,ఆరోగ్యశాఖ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆదివాసీలకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలే లక్ష్యం

Divitimedia

ఆశ్రమ పాఠశాలలకు 75 కంప్యూటర్లు

Divitimedia

ఆదమరిస్తే… అంతే సంగతులు…

Divitimedia

Leave a Comment