భద్రాచలం నుంచి ఆంధ్రాకు బస్సు సర్వీసులు పెంపు
వివరాలు వెల్లడించిన డీఎం జంగయ్య
✍️ దివిటీ మీడియా – భద్రాచలం
తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుప్రాంతాలకు ఆర్టీసీ బస్ సర్వీసులు పెంచినట్లు డిపో మేనేజర్ (డీఎం) పి.జంగయ్య సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలోని విజయవాడ సెక్టార్లో సూపర్ లగ్జరీ బస్సులు తెల్లవారుజామున 3.00, 4.20, 5.30గంటలకు, మధ్యాహ్నం వేళ 13.40, 14.10, 15.00 గంటలకు బయలుదేరతాయని తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఉదయం 7.45, 8.45, 10.00గంటలకు, సాయంత్రం 19.00, 19.30, 20.00 గంటలకు బయలుదేర నున్నట్లు వెల్లడించారు. గుంటూరు సెక్టార్లో ఢిలక్స్ బస్సులు ఉదయం 8.20 గంటలకు ఒకటి, రాత్రి 20.00 గంటలకు మరొకటి బయలుదేరతాయని డీఎం తెలిపారు. అవే తిరుగుప్రయాణంలో ఉదయం 8.10గంటలకు, సాయంత్రం 16.30 గంటలకు బయలుదేరతాయని వెల్లడించారు. అమలాపురం వయా కుక్కునూరు, రాజమండ్రి మీదుగా డీలక్స్ బస్సులు ఉదయం 4.30, 10.30 గంటలకు, ఎక్స్ ప్రెస్ బస్సు రాత్రి 21.00 గంటలకు బయలుదేరతాయన్నారు.అవే తిరుగుప్రయాణంలో ఎక్స్ ప్రెస్ ఉదయం 8.15 గంటలకు, డీలక్స్ బస్ లు 16.30, 21.00 గంటలకు బయలుదేరతాయని వివరించారు. భీమవరం డీలక్స్ బస్సు పాల్వంచ, దమ్మపేట, చింతలపూడి, ఏలూరు(వయా)మీదుగా ఉదయం6.30 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఆ బస్ తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 13.45 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు. ఏలూరు బస్ కొత్తగూడెం, సత్తుపల్లి, చింతలపూడి మీదుగా డీలక్స్ బస్సు మధ్యాహ్నం 14.00 బయలుదేరి తిరుగుప్రయాణంలో ఉదయం 8.00 గంటలకు బయలుదేరుతుందన్నారు. ఈ బస్ సర్వీసులన్నింటికీ రిజర్వేషన్ సౌకర్యం ఉందని డీఎం పి.జంగయ్య వెల్లడించారు. భద్రాచలం చుట్టుపక్కల ప్రజలు పెరిగిన ఈ బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

