తెలంగాణలో ‘ఎస్ఐఆర్’ గడువు పొడిగింపు
✍️ దివిటీ మీడియా – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో ‘ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)’ గడువు పొడిగిస్తూ భారత ఎన్నికల సంఘం సోమవారం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అక్టోబర్ 7 వరకు ‘ఎస్ఐఆర్’ గడువు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మారిన తాజా షెడ్యూల్ ప్రకారం ఈ ప్రత్యేక సవరణలో అక్టోబర్ 7వరకు ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించి, నవంబర్ 5వ తేదీలోగా వాటి పరిష్కారానికి నిర్ణయించారు. తర్వాత తుది ఓటర్ల జాబితాలను నవంబర్ 9న ప్రకటించనున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

