Divitimedia
BusinessKhammamLife StylePoliticsSpot NewsTelanganaWELFARE

మధిరలో ఆర్.అండ్.బి స్థలాల్లో ఆక్రమణల తొలగింపు

మధిరలో ఆర్.అండ్.బి స్థలాల్లో ఆక్రమణల తొలగింపు

✍️ దివిటీ మీడియా (మధిర)

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో రోడ్డు విస్తరణ, అండర్ గ్రౌండ్ కేబుల్ పనులకు అడ్డుగా ఉన్న ఆర్.అండ్.బి స్థలాల్లోని ఆక్రమణల తొలగిపు ప్రక్రియ చేపట్టారు. పనుల్లో భాగంగా ఆత్కూర్ రింగ్ సెంటర్ నుంచి ఆర్.అండ్.బి రోడ్డుకిరువైపులా 50 అడుగుల వరకు స్థలం క్లియర్ చేసే పనులు ఆరంభించారు. జేసీబీలతో ఇరు వైపులా ఉన్న ఆక్రమణలను తొలగించే పనులు ఆర్.అండ్.బి, మున్సిపాలిటీ అధికారులు పోలీసుశాఖ సహకారంతో
చేపట్టారు. ఆత్కూరు నుంచి అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు, ఫోర్ లైన్స్ రోడ్డు విస్తరణపనులు చేపట్టడంతో రోడ్డుకు రెండువైపులా 50 అడుగుల వరకు ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. మధిర పట్టణ (మున్సిపాలిటీ) పరిధిలోని ఆక్రమణలు ఈ నెల 10వ తేదీలోగా స్వచ్ఛందంగా తొలగించుకోవాలని మధిర మున్సిపల్ కమిషనర్ ప్రజలకు సూచించారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని మధిర అధికారులు కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

2న మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

Divitimedia

శ్రీరామనవమి ఏర్పాట్లపై 6న సమీక్ష సమావేశం

Divitimedia

ముక్కోటి మహోత్సవాల్లో బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

Divitimedia

Leave a Comment