Divitimedia
FarmingKhammamLife StyleSpot NewsTechnologyTelanganaWELFARE

రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలిజిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

✍️ దివిటీ మీడియా (ఖమ్మం)

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు నీటి సామర్థ్యాన్ని బట్టి తక్కువరోజుల్లో దిగుబడినిచ్చే పంటలు సాగు చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. ఎల్ నినో ప్రభావం కారణంగా జిల్లా రైతాంగంలో నెలకొన్న ఆందోళన తొలగించేందుకు పొలంబాట పట్టిన జిల్లా కలెక్టర్, పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం పోచారం గ్రామంలో రైతులతో మాట్లాడి వర్షాభావ పరిస్థితుల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు వివరించారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సూచించారు. రైతులు బోరుబావుల నీటి సామర్థ్యాన్ని బట్టి ప్రత్యామ్నాయపంటల సాగు వైపు మొగ్గు చూపాలన్నారు. జూన్ నెల నుంచి ఇప్పటివరకు జిల్లాలో తక్కువ వర్షపాతం మాత్రమే నమోదైనందున, భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా రైతులు తమ బోరుబావుల్లో అందుబాటులో ఉన్న నీటి సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలన్నారు. అధికంగా నీరు అవసరమయ్యే పంటల విస్తీర్ణాన్ని తగ్గించి, స్వల్పకాలిక పంటలను సాగు చేయడం ఉత్తమమని సూచించారు. వరిసాగుకు బదులు ఆరుతడి పంటలు సాగుచేయాలని కోరారు. రిజర్వాయర్ల లో నీటినిల్వలు తక్కువగా ఉన్నాయని, వరి సాగు చేసి రైతులు నష్టపోకుండా ఉండేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, కావాల్సిన నిల్వలున్నాయన్నారు.ప్రత్యామ్నాయ పంటలకు కావాల్సిన ఆరుతడి పంటల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే పరిస్థితుల్లో పంటలకు అనువైన స్వల్పకాలిక, కరువును తట్టుకునే పంటలు సాగు చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచించే పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని, వాతావరణ మార్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు సంప్రదాయ సాగు విధానాలకు బదులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని, నీటిని ప్రతి చుక్కను పొదుపుగా వినియోగిస్తూ తక్కువ వ్యవధిలో అధికాదాయం అందించే కూరగాయలు, ఇతర రకాల సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో కూసుమంచి తహసిల్దార్ డి.సైదులు, మండల వ్యవసాయాధికారి ఆర్.వాణి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ముంపు ప్రాంత మండలాల్లో పర్యటించిన కలెక్టర్

Divitimedia

పార్ట్ టైం అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం

Divitimedia

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠినచర్యలు : డీఎంహెచ్ఓ

Divitimedia

Leave a Comment