Divitimedia
Bhadradri KothagudemEducationHealthLife StyleSpot NewsTelanganaYouth

అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల పరిశీలించిన నోడల్ అధికారి

అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల పరిశీలించిన నోడల్ అధికారి

✍️ కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 14)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సూచన మేరకు శనివారం కొత్తగూడెంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను నోడల్ అధికారి డాక్టర్ ప్రభుదయాల్ సందర్శించారు. ఆ పాఠశాలలో భోజనశాల, తరగతి గదులను పరిశీలించి, పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇటీవలే కలెక్టర్ జిల్లా మంజూరు చేసిన వస్తువులు, పనుల గురించి తెలుసుకుని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పేరెంట్స్ లేని విద్యార్థులు కృష్ణవంశీ, అభిరామ్, లక్మ, రాకేష్ లకు వారి కోరిక మేరకు నూతన దుస్తులు, జామెట్రీ బాక్స్ లు, సబ్బులు, తువ్వాలు, పెన్నులు, పెన్సిళ్లు ఇచ్చారు. చదువే మన తలరాతను కచ్చితంగా మారుస్తుందని, చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. పిల్లలతో గడిపి, నీతిబోధలతో ఛైతన్యం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సైబర్ నేరాల్లో 13మంది యువకులు అరెస్టు

Divitimedia

పాఠశాల పనుల్లో నాణ్యతలోపంపై కలెక్టర్ ఆగ్రహం

Divitimedia

ఓటరు జాబితాలో ఓటు పరిశీలించుకోండి : కలెక్టర్ డా.ప్రియాంకఅల

Divitimedia

Leave a Comment