Divitimedia
BusinessCrime NewsHyderabadKhammamLife StyleNational NewsTechnologyTelangana

వాహనానికి మరమ్మత్తులు, రూ.40వేల పరిహారం

వాహనానికి మరమ్మత్తులు, రూ.40వేల పరిహారం

ద్విచక్రవాహన విక్రయదారులకు వినియోగదారుల ఫోరం ఆదేశం

✍️ ఖమ్మం – దివిటీ మీడియా (మే 23)

హోండా యూనికాన్ వాహనం వల్ల వినియోగదారుడికి తలెత్తిన సమస్యలకు, మానసిక ఇబ్బందికి, ఖర్చులకు గాను ఫిర్యాదుదారునికి పరిహారం చెల్లించవలసిందిగా
ఖమ్మం జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్(ఫోరం) ప్రతివాదులకు ఆదేశాలిచ్చారు. ఈ కేసులో వాహన తయారీదారైన హోండా కంపెనీ, అమ్మకందారు కటకం మోటార్ షోరూం వారికి జరిమానా విధిస్తూ ఖమ్మం జిల్లా వినియోగదారుల సమస్యల పరిష్కార కమిషన్ చైర్మన్ వడ్లమాని లలిత, సభ్యురాలు మాధవి లత తీర్పునిచ్చారు. వినియోగదారుడి తరపు న్యాయ వాదులు తెలిపిన కేసు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం పట్టణం రోటరీనగర్ ప్రాంతానికి చెందిన మండడపు నారాయణరావు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఖమ్మం పట్టణంలోని హోండా మోటార్ సైకిల్ డీలర్ కటకం మోటార్ షోరూం ద్వారా 2022 మార్చి నెలలో హోండా యునికార్న్ ద్విచక్రవాహనం కొనుగోలు చేశారు. జీవనోపాధి కోసం రోజువారి శ్రమ చేస్తూ ఎలక్ట్రికల్ పనులు అవసరం ఉన్నవారికి వెంటనే పనులు చేసేందుకు వీలుగా అప్పుచేసి కొత్త వాహనం కొనుగోలు చేశారు. రూ.1,29,000లు చెల్లించి కొనుగోలు చేసిన వాహనం కొద్దికాలంలోనే వాహనంలో కొన్ని శబ్దాలు చేస్తూ, ఓవర్ హీట్ అవుతూ, వాహనం కిక్ స్టార్ట్ కావటం లేదని, కాలుతో ఎన్నోసార్లు బలంగా కొడితే మాత్రమే స్టార్ట్ అవుతోందని, రోడ్డుపై కొంత దూరం ప్రయాణించగానే ఆగిపోతోందదని, స్టార్టింగ్ ట్రబుల్ తో కొత్తగా కొన్నవాహనంతో తాను ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. పలుమార్లు షోరూం వారిని సంప్రదించి ఆ సమస్యకు పరిష్కారం లభించలేదని, వినియోగదారుడైన తనకు న్యాయం చేయవలసిందిగా న్యాయవాది వెల్లంపల్లి.నరేంద్రస్వరూప్, శరత్ బాబు లను సంప్రదించారు. వారి ద్వారా ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించి కేసు దాఖలు చేశారు. కాగా పలుమార్లు షోరూం వారు వాహనాన్ని తనిఖీ చేసినా ఫలితం లేకపోవడంతో పాటు, తీవ్రమైన మాటలతో సామాన్యుడినైన తనను ఇబ్బందులతో అవమానాలకు గురిచేస్తున్నట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు, పూర్వాపరాలు పరిశీలించిన కమిషన్, వినియోగదారు నారాయణరావుకు అనుకూలంగా ఆదేశాలిచ్చారు. ఆ హోండా యూనికాన్ వాహనం ప్రయాణానికి వీలుగా సరైన రీతిలో ఉండేలా వాహన పరికరాలు ఉచితంగా అందజేయాలని ఆదేశించారు. దానితోపాటు సదరు వినియోగదారునికి జరిగిన మానసిక ఇబ్బందికి, వేదనకు గురిచేసినందుకు రూ.30 వేలు, ఖర్చులకోసం మరో రూ.10వేలు కలిపి ఆ మొత్తం 45రోజుల లోపు హోండా యూనికాన్ వాహనం అమ్మకందారైన కటకం షోరూం యాజమాన్యం, తయారీదారు కంపెనీలు చెల్లించవలసిందిగా కమిషన్ చైర్మన్ వడ్లమాని లలిత, సభ్యురాలు మాధవీలత తీర్పునిస్తూ ఆదేశించారు. వినియోగదారును తరఫున న్యాయవాది వి నరేంద్ర స్వరూప్, శరత్ బాబు వాదనలు వినిపించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తెలంగాణ సౌత్ జోన్ సబ్ జూనియర్ బాలుర హాకీజట్టు కోచ్ గా నిఖిల్

Divitimedia

బ్రిలియంట్ లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

Divitimedia

మినిమమ్ వేజెస్ బోర్డు సభ్యుడిగా ‘యారం’ ప్రమాణస్వీకారం

Divitimedia

Leave a Comment