Divitimedia
Crime NewsEducationHyderabadKarimnagarLife StyleSpot NewsTelanganaWELFAREWomen

లంచం తీసుకుంటూ పట్టుబడిన సీడీపీఓ

లంచం తీసుకుంటూ పట్టుబడిన సీడీపీఓ

✍️ దివిటీ మీడియా – హైదరాబాద్

తన పర్యవేక్షణ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల టీచర్ల నుంచి రూ.63,000 లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి సీడీపీఓ దారోజు పద్మ శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.. ఏసీబీ కరీంనగర్ రేంజ్ అధికారులు విడుదల చేసిన వివరాలిలా ఉన్నాయి. మెట్ పల్లి మండలంలోని 21 అంగన్వాడీ కేంద్రాల నుంచి సీడీపీఓ పద్మ ప్రతినెలా ఒక్కొక్క సెంటర్ కు రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నట్లు కనుగొన్నారు. మూడు నెలల మొత్తం రూ.63,000 ఫిర్యాదుదారుల నుంచి తన కార్యాలయ ఆవరణలోనే తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేశారు. ఆ మొత్తంతో సీడీపీఓను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తన పర్యవేక్షణ పరిధిలో అంగన్వాడీకేంద్రాల తనిఖీల్లో గుర్తించిన అవకతవకలపై ఏ చర్యలు తీసుకోకుండా ఉండటం కోసం ఆమె ఈ విధంగా డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. నిందితురాలిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా ప్రకటించారు. ఫిర్యాదు దారుల వివరాలు వెల్లడించలేమని, కేసు విచారణలో ఉందని వారు ప్రకటించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నామినేషన్లు దాఖలు చేసిన బూసిరెడ్డి అభ్యర్థులు

Divitimedia

ఇంటింటి కుటుంబసర్వే ప్రారంభించిన జిల్లా కలెక్టర్

Divitimedia

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అదానీ ప్రతినిధులు

Divitimedia

Leave a Comment