Divitimedia
Bhadradri KothagudemEducationHanamakondaHyderabadJayashankar BhupalpallyKhammamMahabubabadMuluguNalgondaWarangalYouth

ఐబీపీఓ, క్లర్కు పరీక్షలకు శిక్షణకై దరఖాస్తు చేసుకోండి : ఐటీడీఏ పీఓ

ఐబీపీఓ, క్లర్కు పరీక్షలకు శిక్షణకై దరఖాస్తు చేసుకోండి : ఐటీడీఏ పీఓ

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

ఇండియన్ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లర్కు నియామకపు పరీక్షలకు శిక్షణ కోసం  దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ  (ప్రాజెక్ట్ అధికారి) ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు అవసరమైన శిక్షణ హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘పీఈటీసీ’లో 60 రోజులపాటు  ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల డిగ్రీ ఆధారంగా ఎస్టీలు 75మంది, ఎస్సీలు 15, బీసీలు 10 మంది చొప్పున మొత్తం 100మంది పరీక్ష రాసే అభ్యర్థులకు ఈనెల 16నుంచి శిక్షణ ఆరంభమవుతుందని వివరించారు. శిక్షణ పొందగోరే అభ్యర్థులు http://studycircle.cgg.gov.in వెబ్సైట్లో ఈనెల 10వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. దరఖాస్తు చేసుకునే తెలంగాణ అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ3 లక్షల లోపే ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040-27540104 ఫోన్ నెంబర్ కు ఉదయం 10-30 గంటల నుంచి సాయంత్రం 5గంటల లోపు అన్ని పనిదినాలలో సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మద్యం బెల్టుషాపుల నిర్వాహకులు 32మంది బైండోవర్

Divitimedia

“ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల’పై అసత్య ప్రచారం మానుకోవాలి

Divitimedia

ఎడతెగని పోడు వివాదంలో ఉద్రిక్తత

Divitimedia

Leave a Comment