Divitimedia
Bhadradri KothagudemCrime NewsHealthHyderabadLife StylePoliticsSpot NewsTelanganaTravel And TourismWELFAREWomenYouth

కండక్టర్ ప్రవళికకు నివాళులర్పించిన మంత్రి, ఆర్టీసీ ఎండీ

కండక్టర్ ప్రవళికకు నివాళులర్పించిన మంత్రి, ఆర్టీసీ ఎండీ

ప్రవళిక తల్లికి అండగా ఉంటామని మంత్రి హామీ

✍️ దివిటీ మీడియా – హైదరాబాద్

ఇటీవల ఓ ప్రయాణికురాలితో వివాదంలో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించిన టీజీఎస్ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండి యారం నాగిరెడ్డి బుధవారం ఉదయం హైదరాబాదులో ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రవళిక తల్లిని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రవళిక తల్లికి ఉద్యోగం, ఇందిరమ్మఇళ్లు, ప్రభుత్వం, ఆర్టీసీ నుంచి రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియాతోపాటు, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బ్యాంకు నుంచి రూ.1కోటి ప్రమాద బీమా అందనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ఆర్టీసీ కుటుంబసభ్యురాలిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే మేనేజ్మెంట్ తరఫున ఆసుపత్రికి కూడా వెళ్లామని, మంచి చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ దురదృష్టవశాత్తూ కండక్టర్ ప్రవళిక దూరమైందన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాలు కలుగజేస్తుందని, అదే సందర్భంలో కార్మికుల సంక్షేమం, భద్రత ముఖ్యమని తెలిపారు. ఇటువంటి అంశాల మీద కఠినచర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ సంఘటనలో దోషి మీద హత్యాప్రయత్నం కింద ఉన్న కేసును ఇప్పుడు హత్య కేసుగా నమోదు చేసి తగిన విధంగా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగవద్దని, ఒకవేళ తమ సిబ్బంది ఎక్కడైనా పొరపాటుగా ప్రవర్తించారంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ పద్ధతికి బడులుగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని తోసివేయడం వల్ల ఈరోజు ఒక కుటుంబం రోడ్డున పడ్డదన్నారు. ఆ కుటుంబానికి ఆర్టీసీ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తల్లికి ఉద్యోగంతో పాటుగా ఒక ఇందిరమ్మ ఇల్లు, పరిహారాలతో ఆర్థికంగా ఇబ్బంది లేకున్నప్పటికీ ఒక కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన బాధ ఎవరు తీర్చలేనిదన్నారు. పూర్తిస్థాయిలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల సంక్షేమానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. ఎక్కడా కూడా కార్మికులలో అసహనం అనేది లేకుండా వారిపట్ల పెండింగులో ఉన్న అన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. హాస్పిటల్ కి వెళ్లి ప్రవళిక తల్లికి ధైర్యం చెప్పానని, చాలా బాధ్యతగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పామని మంత్రి తెలిపారు. ప్రయాణికులకు ఏదైనా ఉంటే ఎవరైనా పొరపాటున తమ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే పిర్యాదు చేయవచ్చని, ఇలాంటి దాడులు సరికాదన్నారు. క్రమశిక్షణతో కాకీ బట్టల సంస్థగా ఆర్టీసి ముందుకు వస్తుందన్నారు. క్రమశిక్షణ తప్పవద్దని మా వాళ్లను కోరుతానని, ప్రయాణికులే దేవుళ్లు, కస్టమరే దేవుడు అన్నట్టుగా ప్రయాణికులకు సౌకర్యం కలుగజేయడం మన బాధ్యతన్నారు. ప్రయాణికుల వల్ల కూడా ఏమైనా అసౌకర్యం కలిగితే మనం కూడా చట్టం ముందు ఫిర్యాదు చేద్దామని సిబ్బందికి సూచించారు. మా వాళ్లు బాధ్యతగా వందల సందర్భాల్లో మీడియాకు ఇచ్చారని, ఏదైనా వస్తువు తప్పిపోయి దొరికితే కూడా బాధ్యతగా తిరిగి అప్పచెప్పినటువంటి సంస్థ తమ ఆర్టీసీ అన్నారు. సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందన్నారు. తమ వాళ్ల భద్రత తమ ప్రాధాన్యతని, ప్రయాణికుల సౌకర్యం కూడా అంతే ప్రాధాన్యతన్నారు.
పరస్పరమైన ఇబ్బంది కలిగితే చట్టంలో ఫిర్యాదులు చేసుకోవాలే తప్ప ఇలాంటి సంఘటనలకు పాల్పడొద్దని కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

“తగ్గేదెలే…” మేడమ్ టుస్సాడ్స్ సెల్ఫీతో అల్లు అర్జున్ హంగామా

Divitimedia

ఆగస్టులో గోదావరి జలాలు వైరా రిజర్వాయరుకు తరలించే ప్రయత్నం

Divitimedia

బూర్గంపాడు ఐకేపీలో ఆగని అక్రమాలు

Divitimedia

Leave a Comment