Divitimedia
Bhadradri KothagudemBusinessEducationLife StyleSpot NewsTechnologyTelanganaWELFARE

ప్రారంభమైన గ్రామపంచాయతీస్థాయి ఆర్థిక అవగాహన

ప్రారంభమైన గ్రామపంచాయతీస్థాయి ఆర్థిక అవగాహన

✍️ దివిటీ మీడియా – వైరా

కేంద్రప్రభుత్వ ఆర్ధికసేవల విభాగం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ పంచాయతీ స్థాయి ఆర్థిక అవగాహన శిబిరాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. జూలూరుపాడు మండలం అనంతారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన శిబిరంలో బ్యాంకులు అందిస్తున్నసేవలు, కేవైసీ అప్డేట్ చేసుకోవడం వంటి అంశాల గురించి అవగాహన కల్పించారు. వీటితో పాటు వినియోగంలోలేని బ్యాంకుఖాతా పునరుద్ధరణ, ప్రధానమంత్రి జీవన జ్యోతి పథకం, ప్రధానమంత్రి సురక్ష బీమా పథకాలు, అటల్ పెన్షన్ యోజన పథకం, పొదుపు పథకాల ఉపయోగంపై వివరించారు. డిజిటల్ లావాదేవీల అవశ్యకత, సైబర్ మోసాల బారిన పడి మోసపోకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ మోసం జరిగినపుడు 1930టోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగించడం, కిసాన్ క్రెడిట్ కార్డు, క్లెయిమ్ చేయని డిపాజిట్లను తిరిగి తీసుకునే విధానం, రుణాల సక్రమ చెల్లింపు వల్ల కలిగే ఉపయోగాలు, నామినేషన్ సౌకర్యం, తదితర వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలడిగిన సందేహాలు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కస్టమర్ సర్వీస్ పాయింట్ సిబ్బంది, ఆసక్తిగల ఖాతాదారులను బీమాపథకాల్లో నమోదు చేసి, సర్టిఫికెట్లు అందించారు.
డిసెంబర్ 31లోగా జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం ఒక శిబిరం నిర్వహించే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో, అన్ని బ్యాంక్ శాఖలు, ప్రభుత్వశాఖల సమన్వయంతో కృషి చేస్తున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి తెలియజేశారు. ఈ శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ పి.జి.ఎన్.శర్మ, ఎంపీడీఓ టి.రవి, సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి శైలజ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలూరుపాడుశాఖ మేనేజర్ ప్రవీణ్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గుండెపూడి శాఖ మేనేజర్ వెన్నెల , పే పాయింట్ కస్టమర్ సర్వీస్ పాయింట్ జిల్లా సమన్వయ కర్తకిషోర్, సీఎఫ్ఎల్ సిబ్బంది నాగరాజు, తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకోవాలి

Divitimedia

నకిలీ విత్తనాలు అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేక నిఘా

Divitimedia

ఉగ్రవాదానికి సరైన జవాబిచ్చే హక్కు వినియోగించుకున్న భారత్

Divitimedia

Leave a Comment