Divitimedia
Bhadradri KothagudemLife StyleSpot NewsTelanganaWELFAREWomen

గిరిజనదర్బార్ లో దరఖాస్తులు స్వీకరించిన డీడీ చందన

గిరిజనదర్బార్ లో దరఖాస్తులు స్వీకరించిన డీడీ చందన

✍️ దివిటీ మీడియా – భద్రాచలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజనదర్బార్ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ చందన ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆ దరఖాస్తులు యూనిట్ అధికారులకు పంపుతూ, త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్, సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ అందుబాటులో లేనందున ట్రైబల్ వెల్ఫేర్ ఎస్.డి.సి ఆనంద్ కుమార్, ఈఈ మధుకర్, ఏడీఎంహెచ్ఓ సైదులు, యూనిట్ అధికారులతో కలిసి ఆమె దరఖాస్తులు స్వీకరించారు. ఈ గిరిజన దర్బార్లో పోడుభూములపట్టాలు, గిరివికాసం సబ్సిడీపై విద్యుత్తు, బోర్లు, మోటార్ల కోసం, పోడు పట్టాలు ఆన్లైన్ చేయాలని, స్వయంఉపాధి సాయానికి, భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, మారుమూల ప్రాంత గిరిజన గ్రామాలకు రోడ్డుసౌకర్యం, సోలార్ విద్యుత్ సరఫరా కోసం, నూతన మత్య్ససొసైటీల ఏర్పాటుకు, ఆసరా పెన్షన్లు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో జీవనోపాధికి వ్యక్తిగత శిక్షణలు, దీర్ఘకాలికవ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయానికి దరఖాస్తులు పెట్టుకున్నారన్నారు.గిరిజన దర్బార్లో వచ్చిన అర్జీలు ప్రత్యేక రిజిస్టర్లో, ఆన్‌లైన్ లో నమోదు చేసి అర్హులైన ప్రతి గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామని డీడీ చందన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు, ఏపీఓ వేణు, కొండరెడ్ల విభాగాధికారి గన్యానాయక్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రైతు అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం

Divitimedia

గోదావరిని కొల్లగొడుతున్నవారిని ఆపేందుకు గోతులు తవ్వారు…

Divitimedia

దామరతోగులో ఎన్ కౌంటర్, మావోయిస్టు మృతి

Divitimedia

Leave a Comment