విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు
✍️ దివిటీ మీడియా – ఖమ్మం
ప్రపంచ బధిరుల దినోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.దేవిమానస శనివారం జ్యోతి నివాస్ దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు న్యాయఅవగాహనసదస్సు నిర్వహించారు. దివ్యాంగుల హక్కుల చట్టం–2016, న్యాయసేవాధికారసంస్థల చట్టం గురించి వివరించారు.దివ్యాంగుల కోసం అందుబాటులో ఉండే సమాచార, కమ్యూనికేషన్ సదుపాయాలు, వివక్ష లేకుండా విద్య, ఉపాధి అవకాశాలతో సహా సమాజంలో సమానభాగస్వామ్యం కల్పించడం యొక్క ప్రాధాన్యాన్ని ఆమె తెలియజేశారు. న్యాయపరమైన ఏవైనా సమస్యలు ఎదురైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని సూచించారు. వివిధరంగాల్లో దివ్యాంగులు సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొంది, ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాలు సాధించి ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, సంకేత భాషా అనువాదకులు పాల్గొన్నారు.
—————-
బ్యాంకు కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్
—————-
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో బ్యాంకు కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించినట్లు కార్యదర్శి పి.దేవిమానస తెలిపారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 152 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించినట్లు ఆమె వెల్లడించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

