Divitimedia
Bhadradri KothagudemHealthHyderabadLife StylePoliticsSpot NewsTelangana

‘మైత్రి ట్రాన్స్ క్లినిక్స్’ ప్రారంభించిన సీఎం

‘మైత్రి ట్రాన్స్ క్లినిక్స్’ ప్రారంభించిన సీఎం

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 2)

‘సమాన గౌరవం, సమగ్ర వైద్యం’ లక్ష్యంతో రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ల కోసం ఏర్పాటు చేసిన ‘మైత్రి ట్రాన్స్ క్లినిక్స్’ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వర్చ్యువల్ గా ప్రారంభించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ జి.వి.పాటిల్ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా హాజరై ‘మైత్రి ట్రాన్స్ క్లినిక్’ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లు సమాజంలో భాగంగా అన్నిరకాలుగా వృద్ది చెందాలని, వారికి ‘వర్క్ షాప్’ పెట్టి ఉద్యోగాల్లో స్థిరపడేలా, స్వయం ఉపాధి పథకం ద్వారా ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన వారికి సంక్షేమపథకాలు అందేలా కృషిచేస్తానన్నారు. జిల్లాలో మొత్తం 126 మంది ట్రాన్స్ జెండర్ వ్యక్తులున్నారని, వారికోసం కొత్తగూడెం ఏరియా హాస్పిటల్లో ఓపీ బ్లాక్ లోని రూమ్ నెంబర్ 9 లో ప్రతి గురువారం ప్రత్యేకంగా వైద్య సేవలందించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా వారి కోసం వైద్య నిపుణుడు డా.బాలాజీ, చర్మవ్యాధి చికిత్స నిపుణుడు డా.ప్రశాంత్, సైకియాట్రిస్ట్ డా.మోహన్, జనరల్ మెడిసిన్ డా.కృష్ణారెడ్డిలను నియమించారు. ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీ ఛాంపియన్స్ గా లాలస, అపూర్వ, కౌన్సిలర్ గా సఖి కౌన్సిలర్ ను కూడా అక్కడ నియమించినట్లు అధికారులు ప్రకటించారు. ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు ఆరోగ్య సదుపాయాలు కల్పించడం, అనారోగ్య సమస్యలు, సంక్రమించే వ్యాధులపై తగిన సూచనలు అందించడం, ట్రాన్స్ జెండర్స్ సంఘాలకు ఆరోగ్య సమస్యలపై పూర్తి అవగాహన కల్పించడం, కౌన్సెలింగ్ సేవలు అందించడం ఈ క్లినిక్ ముఖ్యోద్దేశ్యం అని వివరించారు. ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఏదైనా సమాచారం, అవసరాల కోసం 155326 హెల్ప్ లైన్ నెంబరును వినియోగించుకోవాలని తెలిపారు. ట్రాన్స్ జెండర్స్ కు సర్టిఫికెట్లు, ఐడెంటిటీ కార్డ్స్ అందచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, డీఎంహెచ్ఓ భాస్కర్, కొత్తగూడెం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాధామోహన్, కౌన్సిలర్ రుక్మాంగధర్ బండారి, సీడీపీఓలు విజయకుమారి , నవ్యశ్రీ, సఖి అడ్మిన్ శుభశ్రీ, మిషన్ శక్తీ కోఆర్డినేటర్ సంతోషిరూప, వైద్యులు, సెక్యూర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రాజేంద్రప్రసాద్, ట్రాన్స్ జెండర్ల నాయకులు ఈశ్వరమ్మ, జానకమ్మ, షాహిన్, నవ్య, లాలస, అపూర్వ, పలువురు ట్రాన్స్ జెండర్స్ ఏరియా ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

క్రికెట్ ప్రపంచమంతా ‘విరాట్’స్వరూపం…

Divitimedia

ఎన్నికల వేళ మావోయిస్టుల కలకలం…

Divitimedia

ఓటరు జాబితాలో ఓటు పరిశీలించుకోండి : కలెక్టర్ డా.ప్రియాంకఅల

Divitimedia

Leave a Comment