సారపాక సుందరయ్యనగర్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్



✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బూర్గంపాడు మండలం సారపాకలోని సుందరయ్యనగర్లో మంగళవారం తెల్ల వారుజామున పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలులేని బైకులు, ఆటోలు మొత్తం 43 వాహనాలు గుర్తించారు. 46 కార్టన్ల మద్యం సీజ్ చేశారు. వాహనాల సంబంధించిన పత్రాలను పరిశీలించి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ గంజాయి వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి అక్రమ రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియ జేయాలని కోరారు.అలాగే ప్రతి ఒక్కరూ బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, పౌరులందరూ తప్పనిసరి గా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో పాల్వంచ సీఐ సతీష్, ఎస్సైలు మేడా ప్రసాద్, నాగభిక్షం, సబ్ డివిజన్ పరిధి లోని ఇతర స్టేషన్ల పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిపి దాదాపు 50 మంది పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

