Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationHealthLife StyleSpot NewsTelanganaWELFAREYouth

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో బైక్ ర్యాలీ

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో బైక్ ర్యాలీ

150 మందికి హెల్మెట్ల పంపిణీ..

ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు

✍️ దివిటీ మీడియా – భద్రాచలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా 150 మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. విధినిర్వహణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు, దేశం, ప్రజల రక్షణకోసం వారు చేసిన సేవలను అధికారులు వివరించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి సేవలు సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, యువతపై ప్రతికూల ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈసందర్భంగా అనుమానాస్పదలింకులు క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను అపరిచితులెవరితోనైనా పంచుకోవద్దని సూచించారు. నేరాల నియంత్రణ, ప్రజలు భద్రత కోసం ఇళ్ల వద్ద, వ్యాపారసంస్థల వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దుమ్ముగూడెం పోలీసుస్టేషన్ నుంచి క్రాస్ రోడ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు అమరవీరుల త్యాగాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, ప్రజల భద్రత, రోడ్డుప్రమాదాల నివారణ, సామాజిక బాధ్యతపై చైతన్యం తీసుకు రావడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం సీఐలు సట్ల రాజు, రాజు వర్మ, వెంకటప్పయ్య, ఎస్సైలు జగన్మోహనచారి, శ్యాంప్రసాద్, పోలీసు సిబ్బంది, టీజీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీతారామ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి : తుమ్మల

Divitimedia

బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ జితేష్ వి పాటిల్

Divitimedia

ప్రజాఫిర్యాదుల సత్వర పరిష్కారమే లక్ష్యం

Divitimedia

Leave a Comment