Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamLife StyleSpot NewsTechnologyTelanganaTravel And TourismWELFAREYouth

యువ ఆపదమిత్రల శిక్షణ ప్రారంభించిన కలెక్టర్

యువ ఆపదమిత్రల శిక్షణ ప్రారంభించిన కలెక్టర్

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

విపత్తులు సంభవించిన సమయంలో తక్షణమే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో ఆపదమిత్రలు కీలకపాత్ర పోషించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కోరారు. లక్ష్మీదేవి పల్లి మండలం చాతకొండ ఆరవ బెటాలియన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో యువ ఆపదమిత్రల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ జిల్లాలో గోదావరి వరదలు, పట్టణాల్లో నీటి ముంపు, అటవీ అగ్నిప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాల వంటి విపత్తులు సంభవించే అవకాశమున్నందున శిక్షణ పొందిన స్థానిక యువత అందుబాటులో ఉండటం అవసరమన్నారు. అధికారిక సహాయక బృందాలు సంఘటనస్థలానికి చేరుకునేలోపు స్థానికంగా శిక్షణ పొందిన ఆపదమిత్రలు తక్షణ సహాయక చర్యలు చేపట్టడం వల్ల ప్రాణనష్టం తగ్గించవచ్చని తెలిపారు. విపత్తు సమయంలో శారీరక దృఢత్వం, మానసికంగా అప్రమత్తతతో సమయస్ఫూర్తి, పరిస్థితి అంచనా వేసే సామర్థ్యం, సరైన నిర్ణయం తీసుకునేలా నైపుణ్యం కీలకమని తెలిపారు. శిక్షణలో ఎస్ఓపీలు, సమాచారప్రసారం, రెస్క్యూ పరికరాల వినియోగం, టీమ్ వర్క్ వంటి అంశాలను పూర్తిగా నేర్చుకోవాలన్నారు. విపత్తు నిర్వహణ కేవలం తరగతిగదిలో నేర్చుకునేదికాదని, క్షేత్రస్థాయిలో నిరంతర సాధన, మాక్ డ్రిల్స్ ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుందన్నారు. పూర్తి ఏకాగ్రతతో ఈ శిక్షణ తీసుకుని, నేర్చుకున్న అంశాలను పదేపదే సాధనచేసి ఉపయోగపడేలా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. అవసరమైన పరికరాలు, కిట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 6వ బెటాలియన్ కమాండెంట్ పి.సి.వి.రమణ మాట్లాడుతూ, విపత్తులు సమయాల్లో తక్షణ స్పందన అత్యంత కీలకమన్నారు. శిక్షణలో బోట్ నిర్వహణ, తాళ్ల సాయంతో రక్షణ చర్యలు, పైకి ఎక్కడం, కిందికి దిగడం, రాక్ క్లైంబింగ్, వివిధ రకాల ముడుల వినియోగం వంటి ప్రాక్టికల్ అంశాలను పూర్తిగా నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఆపదమిత్రలకు జిల్లా కలెక్టర్ అంకిత్ చేతుల మీదుగా శిక్షణ కిట్లు అందజేశారు. విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో శిక్షణ పొందుతున్న ప్రతి ఆపదమిత్రకు మూడు సంవత్సరాల కాలానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 416 మంది ఆపదమిత్రులకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, తొలివిడతగా 120 మందికి శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మార్గదర్శకాలతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా నెహ్రూ యువ కేంద్రాలు, ఎన్‌ఎస్‌ఎస్‌, మైభారత్‌, స్కౌట్స్ అండ్ గైడ్స్ తదితర సంస్థలతో ఎంపికైన యువతకు ఈ నెల 16నుంచి 22వరకు శిక్షణనిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ శ్రీధర్ రాజా, అసిస్టెంట్ కమాండెంట్ మరియాదాస్, లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష, ఎంపీడీఓ సుచిత్ర, పోలీసు, రెవెన్యూ, విపత్తునిర్వహణ అధికారులు, శిక్షకులు, ఆపదమిత్రలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

గణనాధుని ఆశీస్సులు ప్రజలకు ఉండాలి

Divitimedia

అస్తవ్యస్త పార్కింగ్ అవస్థలకు కాస్త ఊరట

Divitimedia

‘భద్రాచలం ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేటాయించండి…’

Divitimedia

Leave a Comment