సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతంగా వినియోగించాలి

పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనలు
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ కేసుల దర్యాప్తు, నేరస్థుల గుర్తింపు, సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ సాక్ష్యాల సేకరణలో మెరుగైన ఫలితాలు సాధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లో గురువారం ‘టెక్ టీమ్ ఆపరేటర్స్, సైబర్ వారియర్స్’ కు వివిధరకాల పోలీసింగ్ వెబ్ అప్లికేషన్లపై ప్రత్యేక శిక్షణతరగతులు ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ శిక్షణ తీరు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీసీటీఎన్‌ఎస్ 2.0, క్రై-మాక్, ఐసీజేఎస్, టీఎస్-కాప్స్, డయల్-100, ఎఫ్‌ఆర్‌ఎస్, ఎంటర్‌ప్రైజ్ చెక్,ఈ-సాక్ష్య, సైక్యాప్స్, డోపామ్స్, ఎన్‌సీఆర్‌పీ,ఐరాడ్, సమన్వయ పోర్టల్, సీఈఐఆర్, దర్పణ్, సహయోగ్, వాత్సల్య, జీఆర్ఎం, ఎంఆర్ఎఫ్, నాట్ గ్రిడ్, గాండీవ, తదితర వెబ్ అప్లికేషన్లపై పోలీస్ సిబ్బందికి శిక్షణ అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, శిక్షణలో నేర్చుకున్న ఈ అంశాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని టెక్ టీమ్ ఆపరేటర్లు, సైబర్ వారియర్లకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీకోర్ సీఐ రాము, సైబర్ సెల్ సీఐ జితేందర్, సీఐలు రమాకాంత్, లక్ష్మి, పలువురు అధికారులు, టెక్ టీం ఆపరేటర్స్, సైబర్ వారియర్స్, సిబ్బంది పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

