టీఎస్ఎస్ ఉద్యోగులసంఘం జిల్లా కమిటీ ఎన్నిక
✍️ దివిటీ మీడియా – ఖమ్మం
ఖమ్మం జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు బుధవారం ఖమ్మం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా నూతన కమిటీ ఎన్నుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పాగి వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా బొమ్మెర ముత్యం, కోశాధికారిగా చాపలమడుగు కోటేశ్వరరావు ఓటింగ్ లో ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ ఎన్నికలో జిల్లాలోని 22మంది కళాకారులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. కమిటీ గౌరవాధ్యక్షులుగా మునగాల వెంకటరత్నం, గౌరవ సలహాదారులుగా పమ్మి రవి, మిమిక్రీ సుధాకర్, కాల్వకట్ట జాన్, మేడ ముత్తయ్య, ఉపాధ్యక్షులుగా పరకాల అజయ్, కొమ్ము రమేష్, మిమిక్రీ భద్ర, సహాయ కార్యదర్శిగా వెంకట్ నకిరేకంటి, మాచర్ల కృష్ణ, పిడియాల లక్ష్మణ్, ప్రచార కార్యదర్శిగా గోవింద గురవయ్య, మహిళా ప్రతినిధులుగా ఎంగల కుమారి, బీరెల్లి రమణ, కొండ్రు జ్యోతి, ముత్తమాల సునీత, కార్యవర్గ సభ్యులుగా బానోత్ రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

