Divitimedia
EducationKhammamLife StyleSpot NewsTelanganaWELFAREYouth

పాఠశాలల ప్యానల్ ఇన్స్పెక్షన్ టీముల ఏర్పాటు

పాఠశాలల ప్యానల్ ఇన్స్పెక్షన్ టీముల ఏర్పాటు

సపోర్టివ్ సూపర్విజన్ చేయాలని సూచించిన డీఈఓ

✍️ దివిటీ మీడియా – ఖమ్మం

ఖమ్మంలోని సైన్స్ మ్యూజియంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి(ఏఎంఓ) అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్యానల్ ఇన్స్పెక్షన్ టీముల సభ్యులకు డీఈఓ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డీఈఓ జి సదానందం మాట్లాడుతూ, పానల్ సభ్యులు టీచర్ సపోర్టివ్ గైడెన్స్ చేయాలని, టీచర్స్ కి కావలసిన మద్ధతునందించాలన్నారు. స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటుతో పాఠశాలల అభివృద్ధి కోసం ప్యానల్ ఇన్స్పెక్షన్ టీములు పనిచేయాలని కోరారు. జిల్లాస్థాయిలో మొత్తం తొమ్మిది ఇన్స్పెక్షన్ ప్యానల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ప్యానెల్లో ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయుడు టీం లీడరుగాను ఇద్దరు ప్రాథమిక పాఠశాలల టీచర్లు సభ్యులుగా ఉంటారన్నారు. వీరందరినీ కోఆర్డినేట్ చేయడానికి జిల్లాస్థాయిలో నలుగురు సభ్యులతో ‘ఎఫ్.ఎల్.ఎన్ సెల్’ ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో ప్రాథమికపాఠశాలల పర్యవేక్షక టీంలు పంపే రిపోర్టులు రోజువారీ జరిగే విద్యా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఫ్.ఎల్.ఎన్ సెల్ లోగోతో టీషర్టులను డీఈఓ సదానందం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి డీఎస్ఓ, సైన్స్ మ్యూజియం సభ్యులు వెంకటేశ్వర్లు, ఆదిత్యకుమార్, నవీన్ కుమార్, శ్యామ్లాల్, ప్రవీణ్, శ్రావణ్, సేవియా, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

‘భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

Divitimedia

మంచి భవిష్యత్తుపై నిర్దిష్ట లక్ష్యంతో కృషిచేయాలి

Divitimedia

గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్

Divitimedia

Leave a Comment