Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSpot NewsTelanganaWELFAREWomenYouth

మంచి భవిష్యత్తుపై నిర్దిష్ట లక్ష్యంతో కృషిచేయాలి

మంచి భవిష్యత్తుపై నిర్దిష్ట లక్ష్యంతో కృషిచేయాలి

బాలల వారోత్సవాల ముగింపు వేడుకలో కలెక్టర్

✍️ దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (నవంబరు 20)

బాలలు మంచి భవిష్యత్తు కోసం లక్ష్యం నిర్దేశించుకుని కృషితో పరిస్థితులను ఎదిరించి ముందుకు సాగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ సూచించారు. జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలతలెనినా ఆధ్వర్యంలో గురువారం ఐడీఓసీలో నిర్వహించిన బాలల దినోత్సవ వారోత్సవాల ముగింపు వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష్యసాధనలో ఎదుర్కొనే పరిస్థితుల వల్ల చిన్నారులు మానసిక దృఢత్వం సాధిస్తారన్నారని తెలిపారు. క్రీడలపై శ్రద్ధ ఉండాలని, ప్రతిరోజు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని సూచించారు. మణుగూరు చిల్డ్రన్ హోమ్ బాలికలకు స్వెటర్స్, దుప్పట్లు, వాటర్ బాటిల్స్ అందజేశారు. సంతకాల బ్యానర్ పై కలెక్టర్ తొలి సంతకం చేశారు. రైఫిల్ ఈవెంట్ లో విజయం సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెడల్స్ అందజేశారు. బాల్య వివాహాలపై గురుకుల పాఠశాల విద్యార్థినులు స్కిట్, సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) విద్యాచందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలతలెనినా, ఇంచార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్.ప్రసాద్, డాక్టర్ తేజస్వి, షీటీమ్ ఎస్సై రమాదేవి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షర్ఫుద్దీన్, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి పరంధామరెడ్డి, సీడీపీఓలు లక్ష్మీప్రసన్న, పద్మశ్రీ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, మణుగూరు చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్ శిరీష, బాలల పరిరక్షణ అధికారి హరికుమారి, వినోద్, శేషయ్య, బాలల సంక్షేమ సంస్థల ప్రతినిధులు, విద్యార్థినిలు, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆశ్రమ విద్యాలయం తనిఖీ చేసిన ఎస్పీ

Divitimedia

సీతారాం ఏచూరి మరణం సిపిఎం పార్టీకి తీరనిలోటు

Divitimedia

నాలుగు పథకాలకు రూ.45వేల కోట్లు

Divitimedia

Leave a Comment