అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసిన ఎస్పీ
విజిబుల్ పోలీసింగ్పై ఎస్పీ రోహిత్ రాజు ఫోకస్
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. చుంచుపల్లి పోలీస్ స్టేషన్ తో పాటు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలతో జరుగుతున్న పర్యవేక్షణను పరిశీలించి అనుమానాస్పద కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సంబంధిత అధికారులకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు. అలర్టింగ్ ఆఫీసర్లు, రౌండింగ్ అధికారులు క్షేత్రస్థాయిసిబ్బంది తో సమన్వయంతో పనిచేస్తూ రాత్రివేళ పోలీసుల నిఘాను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో గస్తీ నిరంతరాయంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానరహదారులతోపాటు, జనసంచారం తక్కువ ఉండే ప్రాంతాల్లో పోలీసుల విజిబిలిటీ పెంచాలని ఆయన ఆదేశించారు. సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లను నిరంతరం సమీక్షిస్తూ, అలాంటి వ్యక్తుల కదలికలు, కార్యకలాపాలపై నిఘా కొన సాగించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డయల్-112 కు ఫోన్ వచ్చిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బాధితులకు తక్షణసహాయం అందించాలని సిబ్బందికి సూచించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

