Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamLife StylePoliticsSpot NewsTelangana

ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్యేలు, డీసీసీలతో మంత్రి వాకిటి శ్రీహరి సమావేశం

ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్యేలు, డీసీసీలతో మంత్రి వాకిటి శ్రీహరి సమావేశం

✍️ దివిటీ మీడియా (హైదరాబాద్)

ఖమ్మం జిల్లా ఇంచార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి ఉమ్మడి ఖమ్మంజిల్లా ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో బుధవారం హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, మట్టా రాగమయిదయానంద్, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. త్వరలో ఖాళీ కానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా ఇంచార్జ్ మంత్రులు సంబంధిత ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తున్న నేపథ్యంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశావహుల వివరాలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పేర్లను పీసీసీకి పంపించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎడతెగని పోడు వివాదంలో ఉద్రిక్తత

Divitimedia

సారపాకలో పోలీసుల అదుపులో నకిలీ విలేకరులు

Divitimedia

జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజు

Divitimedia

Leave a Comment