Divitimedia
Andhra PradeshCrime NewsMARKAPURAMSpot NewsTechnologyWELFARE

వెలిగొండ ప్రాజెక్టు సందర్శించిన మార్కాపురం ఓఎస్‌డీ

వెలిగొండ ప్రాజెక్టు సందర్శించిన మార్కాపురం ఓఎస్‌డీ

దోర్నాల పోలీసుస్టేషన్‌ తనిఖీ, పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం

✍️ దివిటీ మీడియా (మార్కాపురం)

మార్కాపురం జిల్లా ఓఎస్‌డీ నవజ్యోతి, సబ్ డివిజన్ పోలీసు అధికారులతో కలిసి సోమవారం వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి, అక్కడున్న పరిస్థితులను పరిశీలించారు. అనంతరం దోర్నాల పోలీసుస్టేషన్ సందర్శించిన ఓఎస్‌డీ, ఆ పోలీసుస్టేషన్ పరిసరాలు, పోలీసుల క్వార్టర్స్, స్టేషన్ రికార్డులు తనిఖీచేశారు. అక్కపోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై వారి విధి నిర్వహణ, పని పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. పోలీసులు విధినిర్వహణలో క్రమశిక్షణతో, ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఆదేశించారు. రికార్డుల సక్రమ నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం వంటి అంశాలపై సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోలీసుస్టేషన్‌లో పరిశుభ్రత పాటించాలని, సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించాలని, ప్రజలకు సత్వరస్పందనతో సేవలందిస్తూ పోలీసుశాఖపై ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందించేలా విధులు నిర్వర్తించాలని ఓఎస్‌డీ సూచించారు.

MarkapuramPolice #OSDVisit #NavjyothiIPS #VelugondaProject #DornalaPolice #PoliceInspection #StationInspection #PoliceWelfare #CommunityPolicing #LawAndOrder #GoodGovernance #PublicSafety #AndhraPradeshPolice #PoliceAdministration

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఐఎన్టీయూసీ మిత్రపక్షాల వినూత్న నిరసన

Divitimedia

కార్మికుల భీమా పెంపు పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

Divitimedia

శివలింగాపురంలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

Divitimedia

Leave a Comment