Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationLife StyleSpot NewsTelanganaWELFAREWomen

‘ఆపరేషన్ ముస్కాన్’పై అదనపు కలెక్టర్ సమీక్ష

ఆపరేషన్ ముస్కాన్’పై అదనపు కలెక్టర్ సమీక్ష

✍️ దివిటీ మీడియా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళా శిశు సంక్షేమశాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జులై 1తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్న ‘ఆపరేషన్ ముస్కాన్ – 12′ లో ఫలితాలపై జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన బుధవారం సమీక్షించారు. గత పదిహేను రోజులు గా నిర్వహిస్తున్న’ స్పెషల్ డ్రైవ్’ లో విముక్తి కలిగించిన బాల కార్మికులు, కేసుల నమోదు, తదితర అంశాలపై పూర్తి సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఛైల్డ్ మ్యారేజ్ కేసులు, ఛైల్డ్ లేబర్ కేసులలో ఫిర్యాదు అందిన వెంటనే యఫ్ఐఆర్ నమోదు చేసి, భాదిత బాల బాలికలకు కౌన్సిలింగ్ ఇచ్చి పునరాసం కల్పించాలని ఆమె అధికారును ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా మాట్లాడుతూ, ఆపరేషన్ ముస్కాన్-12 ద్వారా గత 15 రోజుల్లో 39 ఫిర్యాదులందినట్లు వెల్లడించారు. 12ఎఫ్ఐఆర్ లు 26 ఛార్జ్ షీట్లు నమోదు చేశామని, ఒక బాల్య వివాహంపై చర్యలు తీసుకున్నామని వివరించారు. మరో పదిహేను రోజులు సమయమున్నందున లైన్ డిపార్ట్‌మెంట్ లో అందరూ పనిచేసి, రాష్ట్ర స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్’లో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సబ్బాతి సుమిత్రాదేవి, మహమ్మద్ సాదిక్ పాషా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.తుకారాంరాథోడ్, జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి, జిల్లా మైనార్టీ అధికారి అరుణ, లేబర్ ఆఫిసర్ నాగరాజు, డీపీఓ నవిన్, డీసీపీఓ హరి కుమారి, షీటీం ఎస్సై రమాదేవి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సరి ‘హద్దులు దాటుతున్న’ పేదల బియ్యం

Divitimedia

అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించనున్న ఎమ్మెల్యే

Divitimedia

పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి

Divitimedia

Leave a Comment