Divitimedia
Bhadradri KothagudemEducationLife StylePoliticsSpot NewsTelanganaWELFAREWomenYouth

సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు

సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు

✍️ దివిటీ మీడియా – ఖమ్మం ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ సమగ్రాభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంపై గురువారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. పినపాక, భద్రాచలం నియోజకవర్గాలలోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు భద్రాచలంలో ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు అతిథులుగా పాల్గొన్నారు.
కొత్తగూడెం, ఇల్లందు, వైరా నియోజక వర్గాల్లోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు కొత్తగూడెం క్లబ్బులో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం, ఇల్లందు ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో డీఆర్డీఓ ఎం.విద్యాచందన, జడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి, డీపీఓ బి.అనూష, ఇతర ఆధికారులు, సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

Divitimedia

విద్యార్థినులను తరలించే విధానం ఇదేనా?

Divitimedia

భూమాత మాడ్యూల్లో సమస్యలు, పరిష్కారాలపై నివేదించాలి

Divitimedia

Leave a Comment