Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSportsTelanganaYouth

‘నేషనల్ స్పోర్ట్స్ డే’ సందర్భంగా ‘చలో మైదాన్”

‘నేషనల్ స్పోర్ట్స్ డే’ సందర్భంగా ‘చలో మైదాన్”

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

        ‘నేషనల్ స్పోర్ట్స్ డే’ సందర్భంగా మంగళవారం కొత్తగూడెంపట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన క్రీడల అధికారి  కార్యాలయం ఆధ్యర్యంలో ‘చలో మైదాన్” కార్యక్రమం నిర్వహించారు. పలు ఆటలపై అవగాహన కల్పించేలా నిర్వహించిన ఈ   కార్యక్రమంలో పలువురు స్థానికప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, స్థానిక  మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా  అడిషినల్ కలెక్టర్ రాంబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సులోచన, స్థానిక తహసిల్దార్ పుల్లయ్య, జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అధికారి పరంధామరెడ్డి పాల్గొన్నారు.  భారత హాకీ లెజండ్ ద్యాన్ చాంద్ ఫోటోకి పూలమాల అలంకరించి సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు క్రీడల ప్రాముఖ్యత వివరించగా, హార్ట్ ఫుల్ నెస్ టీం సభ్యులు యోగా, మెడిటేషన్ ల ఉపయోగాల గురించి తెలియజేశారు. ‘నేషనల్ స్పోర్ట్స్ డే” సందర్భంగా 100, 400 మీటర్ల పరుగుపందాలు నిర్వహించి విన్నర్, రన్నర్లకు బహుమతులందజేశారు. ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు, ఆల్ ఇండియా సివిల్ టోర్నమెంట్ లలో విజేతలను ఙ్ఞాపికలతో సత్కరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సందిగ్ధావస్థలో ‘డీడబ్ల్యుఓ’ బాధ్యతలు… మార్పుపై చర్చ

Divitimedia

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండురోజుల జైలుశిక్ష

Divitimedia

అతని కన్నుపడితే బంగారం మాయమేనా…

Divitimedia

Leave a Comment