Divitimedia
Bhadradri KothagudemCrime NewsSpot NewsTelangana

భద్రాచలంలో 8 మంది పేకాటరాయుళ్లు, ఇద్దరు జేబుదొంగల అరెస్టు

భద్రాచలంలో 8 మంది పేకాటరాయుళ్లు, ఇద్దరు జేబుదొంగల అరెస్టు

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

భద్రాచలం పట్టణంలోని టూరిజం హోటల్ పక్కనున్న అప్సరలాడ్జిలో పేకాట ఆడుతున్న 8మందిని శుక్రవారం పట్టణం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని అప్సరలాడ్జిలో కొంతమంది పేకాట ఆడుతున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందించారు. ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాలమేరకు, సీఐ నాగరాజురెడ్డి, ఎస్సై పి.వి.ఎన్ రావు, సిబ్బందితో అప్సర లాడ్జిలో సోదా చేశారు. ఈ సోదాల్లో అక్కడ పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,55,350 తోపాటు 8 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ సీజ్ చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిని గంటా రామారావు, పాతూరి ప్రసాద్,వెలగ రమేష్, చెండా చంద్రశేఖరరెడ్డి, బొల్లు సత్యనారాయణ, గూడపాటి శ్రీనివాసరావు, అనుముల సీతారామిరెడ్డి, అడబాల వెంకటేశ్వరరావుగా చెప్తున్నారు. 8మంది పేకాటరాయుళ్లతోపాటు లాడ్జి నిర్వాహకుడి మీద కూడా కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు చెప్తున్నారు. జరిగింది.

ఇద్దరు జేబు దొంగల అరెస్ట్ చేసిన పోలీసులు

మరో సంఘటనలో భద్రాచలం పోలీసులు ఇద్దరు జేబుదొంగలను కూడా శుక్రవారం అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం ఉదయం భద్రాచలం నుంచి కొత్తగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల వద్ద జేబు దొంగతనాలు జరుగుతున్నాయని సమాచారం అందింది. భద్రాచలం పోలీసులు గస్తీ తిరుగుతున్న ఆ సమయంలో కొత్తగూడెం పట్టణానికి చెందిన ఒకరి పర్సును అతని జేబు నుంచి దొంగిలిస్తుండగా, గుర్తించి గట్టిగా అరిచారు. చుట్టుపక్కలున్నవారు, పోలీసులు వచ్చి జేబుదొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. పట్టుబడిన వారిద్దరిని భద్రాచలం పట్టణానికి చెందిన వానపల్లి సతీష్ అలియాస్ రమేష్, కోట జంపయ్య లుగా పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్ కు తరలించినట్లు భద్రాచలం పట్టణ సీఐ నాగరాజురెడ్డి, ఎస్సై పి.వి.ఎన్ రావు తెలిపారు. జేబుదొంగలను అరెస్టు చేసిన భద్రాచలం పోలీసులను ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఈ సందర్భంగా అభినందించారు.ఛ

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్‌ స్టేషన్లు

Divitimedia

ఐటీసీ రోటరీక్లబ్ ఆధ్వర్యంలో బాలికకు సైకిల్ వితరణ

Divitimedia

విజయవాడలో విరిగిపడిన కనకదుర్గమ్మ కొండచరియలు

Divitimedia

Leave a Comment