Divitimedia
EducationHealthHyderabadLife StyleMahabubabadSpot NewsTelanganaWELFAREWomenYouth

కుష్ఠువ్యాధి నిర్మూలనపై సమీక్ష, శిక్షణా కార్యక్రమం

కుష్ఠువ్యాధి నిర్మూలనపై సమీక్ష, శిక్షణా కార్యక్రమం

✍️ దివిటీ మీడియా – మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లాలో కుష్ఠువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం కేంద్ర పరిశీలకులు డాక్టర్ భాగ్యజ్యోతి, తెలంగాణరాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు, తెలంగాణ రాష్ట్ర లెప్రసీ ఆఫీసర్ డాక్టర్ రాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి రాథోడ్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మహబూబాబాద్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో కుష్ఠు వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణ, నిర్మూలన కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే
ఐడీఓసీలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శిక్షణ నిర్వహించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది, ఆర్బీఎస్కే వైద్యాధికారులు, సిబ్బందికి కుష్ఠువ్యాధి లక్షణాలను ప్రారంభదశలోనే గుర్తించడం, చర్మంపై వచ్చే అనుమానిత మచ్చలను పరిశీలించడం, అనుమానిత కేసులను గుర్తించి వైద్యపరీక్షల కోసం పంపించడం, చికిత్స అందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మరీ
ప్రత్యేకంగా 5 నుంచి18 సంవత్సరాల్లోపు వయస్సు గల విద్యార్థుల్లో కుష్ఠు వ్యాధి లక్షణాలు గుర్తించి, అనుమానిత కేసుల విషయంలో వెంటనే తగిన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అవసరమైన సందర్భాలలో ఆ పిల్లల కుటుంబసభ్యులను కూడా పరీక్షించి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి తగిన చికిత్స అందించాలని తెలిపారు. కుష్ఠు వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తించి పూర్తి స్థాయిలో చికిత్స అందించడం ద్వారా వ్యాధిని నయంచేయవచ్చని డాక్టర్.జాన్ బాబు, డాక్టర్ భాగ్యజ్యోతి తెలిపారు. జిల్లాలో కుష్ఠువ్యాధికేసులను గుర్తించి, చికిత్సచేయడం వల్ల మహబూబాబాద్ జిల్లాను కుష్ఠు వ్యాధి రహిత జిల్లాగా కొనసాగించేందుకు అన్ని స్థాయిలలోని ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల్లో కుష్ఠు వ్యాధిపై అవగాహన పెంచడంతోపాటు, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారికవసరమైన వైద్య, ఆరోగ్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.
శిక్షణలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్.అనిత, ఆర్బీఎస్కే వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సీపీఎం ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94 వర్ధంతి

Divitimedia

జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజు

Divitimedia

ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం సాగాలి

Divitimedia

Leave a Comment