Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationLife StyleSpot NewsTechnologyTelanganaWELFAREWomen

ఐసీసీ’పై మహిళా పోలీసులకు అవగాహన

‘ఐసీసీ’పై మహిళా పోలీసులకు అవగాహన

✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ కేంద్రం (ఎస్పీ కార్యాలయం)లో బుధవారం ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ(ఐసీసీ), ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ (పిఓఎస్హెచ్) చట్టంపై మహిళా పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హాజరై మాట్లాడారు. మహిళలు తమ కుటుంబ బాధ్యతలతో పాటు పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ కీలకమైన బాధ్యతలు చేపడుతున్నారని తెలిపారు. విధి నిర్వహణలో మహిళా సిబ్బందికి ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ) కి నిర్భయంగా తెలియజేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. పని ప్రదేశంలో, విధి నిర్వహణలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు అమల్లో ఉన్న ‘లైంగిక వేధింపుల నిరోధక చట్టం– 2013’ నిబంధనలపై ప్రతిఒక్కరూ కనీస అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. మహిళా సిబ్బంది గౌరవం, భద్రత, హక్కుల పరిరక్షణకు ‘ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ’ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. విధినిర్వహణలో మహిళా సిబ్బందికి ఏవైనా సమస్యలు, ఇబ్బందులెదురైతే వాటిని తన దృష్టికి కూడా తీసుకురావాలని, ఆ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ శాఖ లో ప్రతి మహిళాఉద్యోగి ఆత్మవిశ్వాసం, భద్రతతో విధులు నిర్వర్తించే విధంగా అనుకూల వాతావరణం కల్పించడం అందరి బాధ్యతని ఎస్పీ పేర్కొన్నారు.
మహిళా పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంలో కూదా ముందుండాలని సూచించారు. ఆధునిక పోలీసింగ్‌లో కీలకంగా ఉపయోగిస్తున్న నాట్ గ్రిడ్, గాండీవ, సహాయోగ్, తదితర వెబ్ అప్లికేషన్లపై అవగాహన పెంచుకుని, విధి నిర్వహణలో వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ, ఆధునిక టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పోలీసింగ్‌ను మరింత ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్యనాయక్, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అధికారులు సీఐ శ్రీలక్ష్మి, సీఐ రాము, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఇ.శ్రీనివాస్, డిస్టిక్ట్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇంచార్జ్ ఎస్సై శ్రీనివాస్, షీటీమ్ ఎస్సై రమాదేవి, జిల్లా పరిధిలోని మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సైడ్ డ్రైన్ పనుల ఎమ్మెల్యే పాయం భూమిపూజ

Divitimedia

పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

Divitimedia

సంక్షేమం మాటున చక్కగా వసూళ్లు…

Divitimedia

Leave a Comment